: త్వరలో ఆకాశవాణి ప్రత్యేక వార్తా ఛానల్


ప్రభుత్వ మీడియా సంస్థ ఆకాశవాణి ఇక నుంచి 24 గంటల పాటు వార్తలను ప్రసారం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో ప్రత్యేక వార్తా ఛానల్ ను ప్రారంభించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రసారభారతి అనుమతి, సమాచార, ప్రసారశాఖ నుంచి నిధులు అందిన తరువాత ఛానల్ పనులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 3న 'మన్ కీ బాత్' పేరుతో ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అప్పుడే రేడియోకు మరింత ప్రాచుర్యం కల్పించాలని తలచిన మోదీ... నిరంతర వార్తలను ప్రసారం చేయించాలని నిర్ణయించారట.

  • Loading...

More Telugu News