: విండోస్ ఓఎస్ ను తుడిచిపెట్టేందుకు చైనా సన్నాహాలు


మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను దేశం నుంచి తుడిచిపెట్టేందుకు చైనా నిశ్చయించుకుంది. విండోస్ స్థానంలో లినక్స్ ను ప్రోత్సహించాలని భావిస్తోంది. విండోస్ పై చైనా కఠిన వైఖరికి కారణముంది. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ తమ ప్రభుత్వంపైనా, వ్యాపారాలపైనా గూఢచర్యానికి పాల్పడుతోందని చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో, చైనా ప్రభుత్వం అన్ని సంస్థలను విండోస్ నుంచి లినక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ లకు మారాలని ఆదేశించింది. 2020 నాటికి దేశంలో విండోస్ ను తుడిచిపెట్టగలమని అక్కడి సర్కారు భావిస్తోంది.

  • Loading...

More Telugu News