: ఐరాస శాంతి పరిరక్షణ మండలికి భారతీయుడి నియామకం
భారత్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ గుహను ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మండలికి ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నియమించారు. ఈ మేరకు ఆయన అత్యున్నత స్థాయి ప్యానెల్ లో శాంతి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. పద్నాలుగు మందితో కూడిన ప్యానెల్ ను నియమించిన సందర్భంగా బాన్ మాట్లాడుతూ, ఈ ప్యానెల్ ఐరాస భవిష్యత్ శాంతి కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షిస్తుందని... అంతేగాక ప్యానెల్ చేసే సిఫారసులను వచ్చే ఏడాది యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు పంపుతామని చెప్పారు. ఐరాస ప్యానెల్ ఆదేశాలను అనుసరించి... పోరాట స్వభావాన్ని మార్చడం, విధులన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడం, శాంతి పరిరక్షక కార్యకలాపాల సామర్థ్యం, ప్రదర్శనను పెంచడం చేస్తామని పేర్కొన్నారు.