: అతడు భారత క్రికెట్ ఆశాకిరణం, మద్దతివ్వండి: మురళీధరన్


రేపటి నుంచి భారత్-శ్రీలంక వన్డే సిరీస్ జరగనుండగా, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్ టూర్లో విఫలమైనందుకే విరాట్ కోహ్లీని విమర్శించడం తగదన్నాడు. ప్రతి ఒక్కరికీ కెరీర్లో గడ్డుకాలం తప్పదని, కోహ్లీ భారత క్రికెట్ ఆశాకిరణమని, అతనికి మద్దతివ్వాలని పేర్కొన్నాడు. ధోనీ గైర్హాజరీలో, జట్టును కోహ్లీ సమర్థంగా నడిపించగలడని మురళీధరన్ తెలిపాడు. లంకతో సిరీస్ కు ధోనీ లేకపోయినా కోహ్లీ, సురేశ్ రైనా వంటి భీకరమైన ఆటగాళ్ళున్నారని వివరించాడు.

  • Loading...

More Telugu News