: విండీస్ బోర్డును రూ.258 కోట్ల నష్ట పరిహారం కోరుతున్న బీసీసీఐ
ఇటీవల టూర్ ను మధ్యలోనే ముగించడంపై దావా వేయకుండా ఉండాలంటే రూ.258 కోట్ల నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తెలిపింది. భారత పర్యటన నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం ద్వారా తమకు ఎంతో నష్టం వాటిల్లిందని బీసీసీఐ తెలిపింది. ప్రసార హక్కుల అంశంలో తాము భారీగా నష్టపోయామని బోర్డు పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డుకు లేఖ రాశామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. 15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించకుంటే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని లేఖలో పేర్కొన్నట్టు పటేల్ వివరించారు.