: విషాదం అతడిని గిన్నిస్ బుక్ వైపు నడిపించింది!


ఉత్తరప్రదేశ్ కు చెందిన దినేశ్ శాండిల్య (76) వేణుగానంలోనే కాదు, ఫ్లూట్ తయారుచేయడంలోనూ ప్రతిభావంతుడు. ఆయన తయారు చేసిన ఓ ఫ్లూట్ ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. 5 అడుగుల పొడవు, 3.5 అంగుళాల వ్యాసం ఉన్న ఫ్లూట్ ను తయారుచేయడమే కాదు, శాండిల్య దాన్ని వాయించారు కూడా. ఇదే ఆయనను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించింది. అయితే, వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన శాండిల్యకు వేణువుపై మక్కువ కలిగేందుకు కొన్ని విషాదకర పరిస్థితులు కారణమయ్యాయి. సోదరుడు చనిపోవడం, ఆ తర్వాత కొన్నాళ్ళకే భార్య గతించడం ఆయనను మానసికంగా కుంగదీశాయి. అటుపై ఆయన ప్రశాంతత కోసం బృందావన్ వెళ్ళారు. అక్కడి దేవాలయాల్లో వినిపించే సంగీతం, ముఖ్యంగా, హరిప్రసాద్ చౌరాసియా వేణువులో ప్రాణం పోసుకున్న కీర్తనలు శాండిల్యను మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. అప్పటి నుంచి ఆయన ఫ్లూట్ వాయించడమే కాదు, వాటిని తయారుచేయడం కూడా నేర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన 25 అడుగుల పొడవు, ఒక అంగుళం వ్యాసం ఉన్న ఫ్లూట్ ను రూపొందించారు. దానిపైనా అలవోకగా రాగాలు పలికిస్తూ అబ్బురపరుస్తున్నారు.

  • Loading...

More Telugu News