: హృతిక్ రోషన్, సుజన్నే ఖాన్ లకు విడాకులు మంజూరు


బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, అతని భార్య సుజన్నే ఖాన్ లకు విడాకులు మంజూరయ్యాయి. గతేడాది డిసెంబర్ లో విడిపోవాలని నిర్ణయించుకున్న వారిద్దరు ముంబయిలోని బాంద్రా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి ఆధారంగా న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. అయితే, కోర్టు వాదనలకు హాజరయ్యేందుకు హృతిక్ కు వీలుపడకపోవడంతో, మరో తేదీని ఇవ్వాలని అడిగాడట. కానీ, షెడ్యూల్ ప్రకారం అంటే అక్టోబర్ 31న విచారణ పూర్తవడంతో కోర్టు విడాకులిచ్చేసింది. అటు వారిద్దరి పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయాన్ని కూడా త్వరలోనే న్యాయస్థానం తేల్చనుంది. ప్రేమించి వివాహం చేసుకున్న హృతిక్, అతని భార్యకు హ్రిహాన్, హ్రిదాన్ అనే ఇద్దరు కుమారులున్నారు.

  • Loading...

More Telugu News