: యూట్యూబ్ లో మోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్' వీడియోకు ఆదరణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన వీడియోకు యూట్యూబ్ లో అత్యంత ఆదరణ లభించింది. ఈ క్రమంలో ఏకంగా ఆ వీడియో పది లక్షల హిట్లు దాటిందట. ఆర్-విజన్ ఇండియా ఎండీ రవీంద్ర సింగ్ నిర్మించి, పాడిన ఈ వీడియోకు 'ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్' అని టైటిల్ గా పెట్టారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలన్న సందేశాన్ని అందులోని పాటలో చెబుతారు. ప్రధానమంత్రి ఆలోచనలు, ఆయన దూరదృష్టిని ఆ వీడియో ద్వారా ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నించామని రవీంద్ర సింగ్ తెలిపారు.