: మీ బకెట్ ను వాషింగ్ మెషీన్ గా మార్చేస్తుంది.. ధర రూ.1500 మాత్రమే!


పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాలు వాషింగ్ మెషీన్ కు బాగా అలవాటు పడిపోయాయి. అదే సమయంలో ఎన్నో కుటుంబాలు వాషింగ్ మెషీన్ లేకుండానే బండి నెట్టుకొస్తున్నాయి! అందుకు కారణం... దాని ధరే! పేద, మధ్య తరగతి వ్యక్తులకు అది తలకు మించిన భారం. ఇప్పుడలాంటి వారికోసం ఓ అద్భుతమైన ఉపకరణం రూపొందించింది వింబస్ నవ్ రచన కంపెనీ. ఈ పోర్టబుల్ ఉపకరణం పేరు వీనస్. ధర రూ.1500 మాత్రమే. ఏసీ, డీసీ (12 వోల్టు బ్యాటరీ) విద్యుత్ పై వీనస్ పనిచేస్తుంది. ఉతకాల్సిన దుస్తులను బకెట్ లో వేసి వీనస్ ను ఆ బకెట్ లో ఉంచితే చాలు! ఆ ఉపకరణానికి అమర్చిన ఫ్యాన్ దుస్తుల మురికిని వదిలిస్తుంది. దీనిపై వింబస్ నవ్ రచన కంపెనీ వ్యవస్థాపకుడు పియూష్ అగర్వాలా మాట్లాడుతూ, అల్పాదాయ వర్గాల మహిళలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 100-150 ఉపకరణాలను రూ.2500 ధర వద్ద విక్రయించామని, వచ్చే ఏడాది నుంచి రూ.1500కే విక్రయిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News