: విద్యార్థి అయ్యప్ప మాలను తెంచివేసిన టీచర్... స్కూలు వద్ద ఉద్రిక్తత
స్కూల్ కు అయ్యప్పమాల ధరించి వచ్చిన విద్యార్థి పట్ల ఓ ఉపాధ్యాయురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, అయ్యప్ప మాలను కూడా తెంచివేసింది. ఈ ఘటన కర్నూలు పట్టణంలోని ఓ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చోటు చేసుకుంది. జరిగిన ఘటన పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలి చర్యను నిరసిస్తూ స్కూల్ పై దాడి చేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు బైఠాయించారు.