: సరిహద్దు వద్ద శాంతిని పాక్ ఇప్పట్లో విఘాత పరచదు: రాజ్ నాథ్


కాల్పుల విరమణ ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ కు సరైన సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు బీజేపీ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు వద్ద శాంతికి విఘాతం కలిగించే ధైర్యం పాక్ ఇప్పట్లో చేయదన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇటీవలి పాక్ కుతంత్రాలకు తగిన సమాధానమే ఇచ్చామన్న రాజ్ నాథ్, అంతర్జాతీయ సరిహద్దు బలమైన, సాహసోపేతమైన కొత్త నాయకత్వం సారథ్యంలో ఉందని పేర్కొన్నారు. కాబట్టి, పాక్ ఇప్పట్లో ఎలాంటి కాల్పులకు పాల్పడదని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News