: అరకులో సందడి చేస్తున్న బాలకృష్ణ


టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ అరకు లోయలో సందడి చేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమా ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరకు అందాలకు ఏపీ ప్రభుత్వం మరింత మెరుగులు దిద్దుతుందని అన్నారు. విదేశీయులు సైతం అరకును సందర్శించేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. హుదూద్ తుపానుతో ఉత్తరాంధ్ర పూర్తిగా దెబ్బతిన్నదని... ఈ ప్రాంతం 20 ఏళ్ల వెనక్కు వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను బాధితులందరినీ ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా, స్థానిక పార్కులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News