: సోనియా నుంచి రాహుల్ పగ్గాలందుకోవాలి: దిగ్విజయ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, సోనియా నుంచి రాహుల్ నాయకత్వ పగ్గాలు అందుకోవాలని, అతడికి తామంతా మద్దతిస్తామని అన్నారు. పార్టీపై పట్టు సాధించడానికి, పార్టీలో నూతనోత్సాహం నింపడానికి ఇదే మంచి సమయమని అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయంలో రాహుల్ పగ్గాలు చేపట్టడం సరికాదన్న వాదనను కొట్టిపారేశారు. ఏ పార్టీలోనైనా సంక్షోభాలు సహజమని, సీపీఎం, ఆర్జేడీ పార్టీల్లోని సంక్షోభాలపై ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందని దిగ్విజయ్ పేర్కొన్నారు. 38 ఏళ్ళ వయసులోనే నెహ్రూ ఏఐసీసీ అధ్యక్షుడయ్యారని, మౌలానా ఆజాద్ 35 ఏళ్ళ ప్రాయంలోనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారని వివరించారు. రాహుల్ పార్టీ పగ్గాలందుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఉంటుందనుకోనని స్పష్టం చేశారు.