: నేటి నుంచి బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమం... మోదీనే తొలి సభ్యుడు
భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మొదలయ్యే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి సభ్యుడిగా తన పేరును నమోదు చేసుకోనున్నారు. నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నద్దా మాట్లాడుతూ, "దేశ వ్యాప్తంగా ఈసారి చేపట్టే సభ్యత్వ నమోదుతో అన్ని రికార్డులను బ్రేక్ చేయాలనుకుంటున్నాం. ఈ నమోదు ఆరేళ్ల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమంతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మేము కలవనున్నాం. అంతేగాక, సమగ్ర ప్రచార షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు.