: వెైఎస్ జగన్ ఓ రోబో: కొణతాల
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ హ్యూమన్ రోబో అని ఆ పార్టీకి రాజీనామా చేసిన కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాలు, వ్యవహారశైలి, కృత్రిమ నవ్వు అన్నీ మానవ రోబోలాగా ఉంటాయని పేర్కొన్నారు. జగన్ జైలు నుంచి విడుదల అయ్యాక ఆయన నిజస్వరూపం అందరికీ అర్థమయిందన్నారు. వ్యవహారశైలి మార్చుకోవాలని తాను ఎన్నోసార్లు జగన్ కు చెప్పానని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా, జగన్ ప్రవర్తనలో మార్పు రాకపోవడం శోచనీయంగా ఉందన్నారు. కార్యకర్తల్లో, నాయకుల్లో నమ్మకం కలిగించడానికి వారితో రెగ్యులర్ గా మాట్లాడాలని తాను ఎన్నో సార్లు చెప్పానని... కానీ, అతి విశ్వాసంతో తన మాటను పెడచెవిన పెట్టారని ఆయన అన్నారు. వైఎస్ కు ఏదైనా సలహా ఇస్తే ఆలోచించేవారని... కానీ, జగన్ నైజం దానికి పూర్తి విరుద్ధమని చెప్పారు. ఓ మోనార్క్ లా జగన్ వ్యవహారశైలి ఉంటుందని ఆయన తెలిపారు. ఎంతో మంది నాయకులు రాజశేఖర రెడ్డిపై అభిమానంతో వైసీపీలో చేరి రాజకీయ సమాధి అయ్యారని ఆయన అన్నారు. జగన్ చేసిన అవమానాల వల్ల తాను ఈ నాలుగేళ్లు ఎంతో మానసిక క్షోభ, నరకం అనుభవించానన్నారు. జగన్ జైలు నుంచి రిలీజ్ కాకుండా ఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చేదని కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు.