: అనంతపురం జిల్లాలో కలకలం రేపుతున్న 'ఆంత్రాక్స్'


ఆంత్రాక్స్... కొన్నేళ్ల క్రితం మన దేశాన్ని వణికించిన ప్రాణాంతక వ్యాధి. ఇప్పుడు తాజాగా, అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది. 10వ తరగతి చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థిలో ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం, హిందూపురం ఆసుపత్రిలో శ్రీకాంత్ కు వైద్య చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, లేపాక్షి మండలంలో ఆంత్రాక్స్ సోకిన గొర్రెలను తిన్న పలువురు ఈ వ్యాధి బారిన పడ్డట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలోని కంచి సముద్రం గ్రామవాసి తిప్పన్న ఆంత్రాక్స్ లక్షణాలతోనే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో, జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News