: హరీష్ సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారా... ఆయనపై కేసీఆర్ కు నమ్మకం లేదా?


టీఆర్ఎస్ లో కీలక నేత అయిన హరీష్ రావు సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారా? ఆయన విషయంలో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావానికి లోనవుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఇప్పటికే హరీష్ రావు వర్గంలో 20 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే, హరీష్ వర్గంలో మూడొంతుల మంది ఉన్నారన్న మాట. దీనికి కొనసాగింపుగా రేవంత్ మాట్లాడుతూ, హరీష్ ఆపరేషన్ ఆకర్ష్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతారేమోనని కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే తన సీఎం కుర్చీకి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ఇతర పార్టీల వారిని టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటున్నారని అన్నారు. పదవులు పోతాయేమోననే భయంతో, కొందరు మంత్రులు ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి, టీఆర్ఎస్ లో చేరాలని బతిమిలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News