: ఆనందమూ, ఆర్ధ్రత ఉన్నాయి: దాసరి
ఎర్రబస్సు సినిమాలో మంచి హాస్యము, అంతకు మించిన ఆర్ద్రత ఉన్నాయని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తెలిపారు. ఆడియో విడుదల వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రబస్సు సినిమా వేడుకకు టాలీవుడ్ లోని ప్రతి ఇంటి నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. తెలుగు సినీ రంగంలో ఓ ఆడియో వేడుకను సంక్రాంతిలా జరుపుకోవడం చూస్తుంటే తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎర్రబస్సు ఆడియో వేడుక జరగడం తనను సంతోషానికి గురి చేసిందని అన్నారు. అమెరికా వెళ్లాలని సిద్ధమైన ఓ యువకుడు మూడు నెలలపాటు తాతకు హైదరాబాదులో అన్నీ చూపించాలని తాపత్రయపడతాడు. ఆ తాపత్రయమే ఈ సినిమా అని ఆయన వెల్లడించారు.