: 15 మంది టీచర్ల డిస్మిస్
అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరవుతున్న తెలంగాణకు చెందిన 15 మంది టీచర్లపై వేటు పడింది. గతకొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాకపోవడంతో వారిని శాశ్వతంగా విధులనుంచి తొలగిస్తూ కరీంనగర్ జిల్లా డీఈవో ఆదేశాలు జారీ చేశారు. వారెవరి నుంచీ అనుమతి తీసుకోలేదని, విధులకు ఎందుకు గౌర్హాజరవుతున్నారో కూడా సమాచారం లేదని, అందుకే శాశ్వతంగా తొలగిస్తున్నామని వారి డిస్మిస్ పత్రంలో పేర్కొన్నారు.