: దాసరి దర్శకత్వంలో నటించే అదృష్టం చేసుకున్నాను: కేథరీన్
దాసరి గారి దర్శకత్వంలో పనిచేసే అదృష్టం చేసుకున్నానని ఎర్రబస్సు సినిమా హీరోయిన్ కేథరీన్ తెలిపింది. ఆడియో వేడుకలో మాట్లాడుతూ, ఇంత మంది సినిమా రూపకర్తలను తయారు చేసిన ఆయన ఓ పెద్ద సంస్థ అని చెప్పింది. దాసరి అంత గొప్ప మనిషిని జీవితంలో చూడడం ఇదే తొలిసారని కేథరీన్ వెల్లడించింది. ఆయన చెప్పిన నటనను ఆచరిస్తూ చాలా నేర్చుకున్నానని ఆమె వివరించింది. హీరో విష్ణు, తాను బాగా ఎంజాయ్ చేశామని, సెట్ పై బాగా పోట్లాడుకున్నామని కేథరీన్ తెలిపింది.