: ఇలాంటి మనిషి ఉండడు... దాసరికి పెద్ద అవార్డివ్వాలి: కృష్ణంరాజు
దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి మనిషి ఉండడం అరుదని ప్రముఖ నటుడు కృష్ణంరాజు తెలిపారు. 'ఎర్రబస్సు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినీ రంగంలో ఇంత మంది శిష్యులను తయారు చేసుకున్న దర్శకుడు దాసరి అని అన్నారు. అలాంటి దాసరికి పెద్ద అవార్డు ఇవ్వాలని ఆయన సూచించారు. దాసరి తనను మొదట కలిసినప్పుడు సినిమా కధ చెబుతాడనుకుంటే, 'ఇంతకు ముందు రెండు సినిమాలు తీశాను, అంతకంటే రూపాయి ఎక్కువ తెచ్చే సినిమా తీస్తా'నని చెప్పి 'ఇదే కథ' అని అన్నాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు.