: నా మొదటి సినిమా తాతా మనవడు... 151 సినిమా కథ కూడా తాతామనవడే: దాసరి
తన మొదటి సినిమా 'తాతా మనవడు' అయితే తన 151వ సినిమా కూడా తాతా మనవడి అనుబంధం నేపథ్యంలో రూపుదిద్దుకోవడం కూడా కలిసివచ్చేదేనని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన తొలి సినిమా హీరోయిన్ విజయనిర్మలతో తన అనుభవాలను పంచుకున్నారు. అలాగే విజయనిర్మల చెబుతూ కొత్త దర్శకుడిగా సినిమాల్లో ప్రవేశించినప్పటికీ దాసరిలో 'కొత్త' కనిపించేది కాదని, అప్పటికే అనుభవమున్న దర్శకుడిలా పని చేశారని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణ, విజయనిర్మల దంపతులను దాసరి జ్ఞాపికలతో సత్కరించారు.