: తెలంగాణ ప్రభుత్వానికి ఎవరిచ్చారా అధికారం?: పరకాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం అంటే గౌరవం లేదా? అని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తోందని అన్నారు. కమిషనర్ స్థాయి అధికారి ఇంటి నుంచి కారులో బయటకు వస్తే, దారిలో పోలీసులతో అతనిని అటకాయించి, డ్రైవర్ ను బయటకు లాగిపడేసి, పోలీసు డ్రైవర్ తో ఆ కారును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. కమిషనర్ స్థాయి అధికారిపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.