: తండ్రి అడుగు జాడల్లో అర్జున్ టెండూల్కర్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పాదముద్రల్లోనే ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ నడుస్తున్నాడు. నవంబర్ లో సౌతాఫ్రికాలో జరగనున్న అండర్ 18 టోర్నీలో వర్లీ క్రికెట్ క్లబ్ కెప్టెన్ గా బరిలో దిగనున్నాడు. 1988, 89లో సచిన్ కూడా విదేశీ పర్యటనలో సత్తాచాటి టీమిండియాకి ఎంపికయ్యాడు. దీనిపై వర్లీ క్రికెట్ క్లబ్ యజమాని మాట్లాడుతూ, గతేడాది సౌతాఫ్రికా పర్యటనలో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా రాణించాడని అన్నారు. ఆ పర్యటనలో టాప్ స్కోరర్ అర్జునే అని ఆయన తెలిపారు. సచిన్ లానే అర్జున్ కూడా చురుకైన క్రికెటర్ అని వర్లీ క్లబ్ యజమాని అవినాష్ కదమ్ తెలిపారు.