: ఫేస్ బుక్ ఖాతాదారులతో జుకెర్ బర్గ్ ముఖాముఖి
ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ ఖాతాదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. నవంబర్ 2న జరగనున్న ఈ కార్యక్రమంలో, జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ ఖాతాదారులతో ముచ్చటిస్తారు. ఆయన ఫేస్ బుక్ లోని ఉద్యోగులతో ప్రతి శుక్రవారం సమావేశమై వారి సలహాలు, సందేశాలు స్వీకరిస్తుంటారు. ఇదే కార్యక్రమాన్ని ఖాతాదారులకు వర్తింపజేస్తూ వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. దీనిపై జుకెర్ బర్గ్ మాట్లాడుతూ, వినియోగదారులు ఇచ్చే సలహాలను, అడిగే ప్రశ్నలను... తమ సేవలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకుంటామని చెప్పారు.