: శ్రీశైలం జలవివాదంపై బోర్డు నిర్ణయం ఇదే
శ్రీశైలం జలవివాదంపై బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 వరకు శ్రీశైలం డ్యాం నుంచి తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు బోర్డు అనుమతించింది. అందుకుగాను 3 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ వివాదంపై నవంబర్ 15న మరోసారి సమీక్షించనున్నారు. శ్రీశైలం జలవినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.