: అమెరికా సినిమా థియేటర్లలో గూగుల్ గ్లాస్ తరహా ఉపకరణాలపై నిషేధం
అమెరికాలోని సినిమా థియేటర్లలో గూగుల్ గ్లాస్ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగి, ధరించగలిగిన గాడ్జెట్లపై నిషేధం విధిస్తూ అమెరికా థియేటర్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అలాంటి ఉపకరణాల ద్వారా అనధికారికంగా సినిమాలను రికార్డ్ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వారీ నిర్ణయానికి వచ్చారు. అసోసియేషన్ నిర్ణయానికి హాలీవుడ్ థియేటర్ల యజమానులు సమ్మతి తెలిపారు.