: పాటల చిత్రీకరణకు కూడా డ్రోన్లు!


అమెరికాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న మ్యూజిక్ బ్యాండ్ 'ఓకే గో'. ఈ బృందం తాజాగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ వీడియో చిత్రీకరణలో ఓ డ్రోన్ (మానవరహిత విమానం) ను ఉపయోగించడం విశేషం. డ్రోన్ కు కెమెరా అమర్చి దాని సాయంతో పాటను పిక్చరైజ్ చేశారు. గొడుగులు పట్టుకుని, హోండా హైబ్రిడ్ వాహనాలపై ఆర్టిస్టులు విన్యాసాలు చేస్తుండగా, పైనుంచి డ్రోన్ చిత్రీకరించింది. జీపీఎస్ సాయంతో ఈ డ్రోన్ ను నియంత్రించారు. ఈ సీన్లను జపాన్ లో షూట్ చేశారు.

  • Loading...

More Telugu News