: కిక్కిరిసిన ముంబయి వాంఖడె స్టేడియం... చంద్రబాబు హాజరు


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వేదికైన ముంబయిలోని వాంఖడె స్టేడియం పలువురు అతిథులతో నిండిపోయింది. ముంబయి సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ తదితరులు హాజరయ్యారు. అటు, అమిత్ షా ఫోన్ చేయడంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రానున్నారు. కొద్దిసేపట్లో దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

  • Loading...

More Telugu News