: ఇందిర త్యాగాలను గౌరవించడం కేంద్రం బాధ్యత: మనీశ్ తివారీ


దేశానికి ఇందిరా గాంధీ ఎనలేని సేవలు చేశారని, ఆమె త్యాగాలను గౌరవించడం కేంద్రం బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ దేశం కోసం బతికారని, దేశం కోసమే బలయ్యారని తెలిపారు. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని వివరించారు. ఆమెకు విశిష్ట రీతిలో గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒకవేళ అలా గౌరవించలేకపోతే, ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పారిపోతున్నట్టేనని తివారీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News