: ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా ఎవరికీ సమాచారం ఇవ్వొద్దు: కేంద్ర సమాచార కమీషనర్ శ్రీధర్


సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా ఎవరికీ, ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని సీఐసీ (కేంద్ర సమాచార కమీషనర్) మాడభూషి శ్రీధర్ ఓ తీర్పులో తేల్చిచెప్పారు. మీ భార్య జీతం లేదా ఆదాయం వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఆమె అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ధీరజ్ కపూర్ అనే వ్యక్తి డాక్టర్ అయిన తన భార్య ఆదాయ, జమాఖర్చుల వివరాలు తెలుసుకోగోరారు. ఆయన భార్య చేతనాకపూర్ అభ్యంతరాలను లెక్క చేయకుండా, పీఐఓ (ప్రజా సమాచార అధికారి) ధీరజ్ కపూర్ కు సమాచారం అందజేశారు. దీంతో ఆమె సీఐసీని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సీఐసీ, భార్య జీతం ఎంతో తెలుసుకోవడంలో అభ్యంతరం లేదని, అయితే ఆమె జమాఖర్చుల గురించిన సమాచారం ఆమె అనుమతి లేకుండా ఇవ్వరాదని స్పష్టం చేశారు. అలాగే ఐపీఎస్ అధికారులను గాడిదలని తిడితే ఏ చట్టాన్ని ఉల్లంఘించినట్టవుతుందో తెలపాలని ఓ వ్యక్తి కోరారు. ఇలాంటి చెత్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన దానిని తోసిపుచ్చారు.

  • Loading...

More Telugu News