: నిమిషాల్లో చంద్రబాబుకు డిప్లొమేటిక్ పాస్ పోర్టు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిమిషాల వ్యవధిలోనే డిప్లొమేటిక్ పాస్ పోర్టు పొందారు. ఇందుకోసం ఈరోజు ఆయన సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చారు. వెంటనే కార్యాలయ అధికారిణి అశ్విని సత్తారు, డిప్యూటీ పాస్ పోర్టు అధికారి మదన్ కుమార్ రెడ్డి ఏపీ సీఎంను ఆహ్వానించారు. విషయం తెలుసుకుని పది నిమిషాల వ్యవధిలో డిప్లొమేటిక్ పాస్ పోర్టు రెడీ చేయించి ఇచ్చారు. ఈ పాస్ పోర్టు ఉన్నవారిని విదేశాల్లో ఎక్కడా తనిఖీలు చేయరు. వచ్చే నెలలో సింగపూర్, మలేషియాలో పర్యటించనున్న నేపథ్యంలో బాబు పాస్ పోర్టు కోసం వచ్చినట్టు తెలుస్తోంది. అటు, చంద్రబాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పాస్ పోర్టు కార్యాలయానికి తరలి వచ్చారు. చంద్రబాబు కొద్దిసేపు వారితో మాట్లాడి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News