: ఏనుగులు తల్లడిల్లిపోయాయి!
తమ గుంపులోని ఓ ఏనుగులో చలనం లేకపోవడం చూసిన గజరాజుల గుంపు గంగవెర్రులెత్తింది. చిత్తూరు జిల్లా రామాపురం తండాలోని నక్కలగుట్ట వద్ద ఏనుగుల గుంపులోని ఓ ఏనుగు కరెంట్ షాక్తో మృతి చెందింది. దీంతో ఆ గుంపులోని 12 గజరాజులు మృతి చెందిన ఏనుగు చుట్టూ చేరి ఘీంకారాలు చేస్తున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. విగతజీవిగా పడి ఉన్న ఏనుగును చూసిన సహచర ఏనుగులు, ఎప్పుడు విరుచుకుపడతాయోనని సమీప గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. వాటి ఘీంకారాలను విన్న అటవీశాఖ అధికారులు అడవిలోకి వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో వారు జూ అధికారులకు సమాచారమిచ్చారు.