: రసాభాసగా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం... వైసీపీ దాడిలో టీడీపీ కౌన్సిలర్లకు గాయాలు
కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. నంద్యాలలో ఆక్రమణల తొలగింపు అంశంపై వివాదం తలెత్తింది. దాంతో, మున్సిపల్ వైస్ ఛైర్మన్ విజయకుమార్ పై ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. అటు ఇదే అంశంపై టీడీపీ-వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పరస్పరం ముష్టి ఘాతుకాలకు దిగారు. ఈ ఘటనలో టీడీపీ కౌన్సిలర్లుకు, సభ్యులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా వైసీపీ కౌన్సిలర్ల దాడిలో టీడీపీ కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య గాయపడ్డారు. భూమా సమక్షంలోనే ఈ దాడి చోటు చేసుకోవడం గమనార్హం.