: 'మార్స్-2' ప్రయోగానికి ఇస్రో ప్రణాళికలు
ఇటీవలే 'మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్)ను అంగాకరక గ్రహంపైకి పంపి ఇస్రో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అరుణగ్రహంపైకి మరో యాత్ర చేపట్టాలని భావిస్తోంది. 2018లో లాండర్, రోవర్ లతో కూడిన ఓ భారీ ఉపగ్రహన్ని ప్రయోగించాలని భావిస్తోంది. ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎస్.శివకుమార్ మాట్లాడుతూ, "2018లో అంగారకుడిపైకి రెండో మార్స్ మిషన్ ను పంపాలని అంతరిక్ష సంస్థ ప్లాన్ చేస్తోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రయోగాలను చేపట్టాలనుకుంటోంది" అని తెలిపారు. 2016లో చంద్రయాన్-2 ప్రయోగం తరువాత 'మార్స్-2' ప్రయోగం ఉంటుందని శివకుమార్ పేర్కొన్నారు.