: హాకీ ఇండియా అధ్యక్షుడికి పుత్రవియోగం
హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరిందర్ బాత్రా తనయుడు ధ్రువ్ (27) అనారోగ్యంతో మరణించాడు. నాలుగు రోజుల క్రితం తండ్రితో కలిసి మొరాకో వెళ్ళిన ధ్రువ్ కడుపులో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగా కన్నుమూశాడు. ఈ సాయంత్రానికి ధ్రువ్ భౌతికకాయం భారత్ చేరుకోనుంది. కాగా, తనయుడిని కోల్పోయిన నరిందర్ బాత్రాకు ఢిల్లీ క్రికెట్ సంఘం సానుభూతి తెలిపింది. బాత్రా హాకీ వ్యవహారాల్లోకి ప్రవేశించకముందు ఢిల్లీ క్రికెట్ సంఘంలో కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు.