: దేవినేని ఉమను చూసి నేర్చుకోండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు క్లాస్
గురువారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. చాలా మంది మంత్రులు తమ శాఖకు సంబంధించిన విషయాలపై ఏమాత్రం అవగాహన పెంచుకోవటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని ఉమను మిగతా మంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణతో ఉన్న నీటి పంపిణీ వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాదనను బలంగా వినిపిస్తున్న దేవినేని ఉమ లాగా మిగతా మంత్రులు కూడా తమ శాఖకు సంబంధించిన సబ్జెక్స్ పై పట్టు సాధించాలని ఆయన ఆదేశించారు. ఇటీవల మంత్రుల పని తీరుపై చంద్రబాబు నిర్వహించిన సీక్రెట్ సర్వేలో కూడా దేవినేని ఉమ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే!