: నేడు ఇందిర వర్థంతి... ట్వీట్ తో సరిపెట్టిన ప్రధాని మోదీ


నేడు ఇందిరా గాంధీ వర్థంతి. తన అంగరక్షకుల చేతిలో ఆమె ప్రాణాలు విడిచి నేటికి 30 ఏళ్ళు. అయితే, ఈ సందర్భంగా ఇందిర స్మారక చిహ్నం 'శక్తిస్థల్' వద్ద శ్రద్ధాంజలి ఘటించడానికి కేంద్రం తరపున ఒక్కరూ హాజరుకాకపోవడం గమనార్హం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 139వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమంలో పాల్గొనగా, కేంద్ర మంత్రులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. దేశవాసులందరిలాగే, ఇందిరా గాంధీ వర్థంతి నాడు ఆమెను తానూ స్మరించుకుంటున్నానని మోదీ ఓ ట్వీట్ మాత్రం ఇచ్చారు. అటు, శక్తిస్థల్ వద్ద కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, వీరప్ప మొయిలీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, షకీల్ అహ్మద్, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా తదితరులు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News