: లాడెన్ ను చంపిన నాటి యూఎస్ 'సీల్' త్వరలోనే తెరపైకి!


మే 2, 2011... అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా మట్టుబెట్టిన రోజు. పాకిస్థాన్ లోని అబ్బోట్టాబాద్ లో సైనిక స్థావరానికి దగ్గరలో ఓ ఇంటిలో నివసిస్తున్న ఆ టెర్రర్ కింగ్ ను ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ నేవీ 'సీల్స్' తుదముట్టించారు. అప్పట్లో వాళ్ల (సీల్స్) గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. అసలు వాళ్లెవరు? ఎలా ఉంటారు? అనేది తెలియదు. తాజాగా ఆ బృంద మాజీ సభ్యుడైన ఒకతను త్వరలో ఓ డాక్యుమెంటరీలో తన వివరాలు బహిర్గతం చేయబోతున్నట్టు ఫాక్స్ న్యూస్ చానల్ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు గంటల నిడివి ఉండే ఈ డాక్యుమెంటరీ టైటిల్ 'ద మేన్ హు కిల్డ్ ఒసామా బిన్ లాడెన్". రెండు భాగాలుగా నవంబరు 11, 12 తేదీల్లో ఆ మాజీ కమాండో ఇంటర్వ్యూ సహా ప్రసారం చేస్తారట. లాడెన్ ను చంపేందుకు నిర్వహించిన ఆపరేషన్ వివరాలు, చివరి నిమిషంలో లాడెన్ ఎలా ఉన్నాడు? ఆపరేషన్ లో సదరు కమాండో పాత్ర గురించి ఆ డాక్యుమెంటరీలో వివరించనున్నట్లు ఫాక్స్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News