: శాసనసభలో ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు చిత్రాలు తొలగించండి:కేసీఆర్
తెలంగాణ శాసనసభ కమిటీ హాల్ గోడలపై ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు చిత్రపటాలను తీసివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. వీరిద్దరికి తెలంగాణ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదని... అందువల్ల వారి పటాలు శాసనసభలో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. దీంతో, వాటిని తీసివేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. వీరిద్దరి చిత్ర పటాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని... ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగితే వాటిని అప్పగిస్తామని వారు తెలిపారు.