: గూగుల్ ను వీడుతున్న ఆండ్రాయిడ్ సహ వ్యవస్థాపకుడు
'ఆండ్రాయిడ్' సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్ గూగుల్ ను వీడుతున్నాడు. ఈ విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా గూగుల్ వెల్లడించినట్లు ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇక్కడి నుంచి బయటికి వెళ్లనున్న అతను హార్డ్ వేర్ ఉత్పత్తులకు సంబంధించిన సంస్థను ప్రారంభిస్తాడని పేర్కొంది. ఇక, ఆండీ స్థానంలో తమ సంస్థ సైంటిస్ట్, రోబోటిక్స్ బృందంలో సభ్యుడైన జేమ్స్ కుఫ్నర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు గూగుల్ వెెల్లడించింది.