: ఐపీఎస్ లు పరస్పరం సహకరించుకుని సమర్థంగా విధులు నిర్వర్తించాలి: హైదరాబాదులో రాజ్ నాథ్
హైదరాబాదులోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ ఉదయం ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ లు పరస్పరం సహకరించుకుని సమర్థంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఐపీఎస్ లు దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు శిక్షణ పూర్తి చేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. దేశానికి పటేల్ చేసిన సేవలు మరువలేనివన్నారు. పటేల్ జన్మదినాన్ని ఏక్ తా దివస్ గా ప్రధాని ప్రకటించారని హోం మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.