: జగ్గారెడ్డిని సమైక్యవాది అన్నవారు తలసానిని ఎలా చేర్చుకున్నారు?: టీడీపీ
మెదక్ ఉప ఎన్నికలో జగ్గారెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చినప్పుడు, సమైక్యవాదికి టికెట్ ఇస్తారా? అంటూ రాద్ధాంతం చేసిన టీఆర్ఎస్... ఇప్పుడు తలసాని శ్రీనివాసయాదవ్ ను పార్టీలో ఎలా చేర్చుకుందని టీడీపీ మండిపడింది. గతంలో తలసానిని కూడా సమైక్యవాదిగా అభివర్ణించిన టీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు ఆయనను పార్టీలోకి ఎలా చేర్చుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్న శ్రీనివాసయాదవ్ సికింద్రాబాదులో గెలవలేకే సనత్ నగర్ నుంచి పోటీ చేశారని ఎద్దేవా చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలసాని కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. దమ్ముంటే, తలసాని తన పదవికి రాజీనామా చేసి... తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు గురించి అధిక ప్రసంగం చేయడాన్ని తలసాని మానుకోవాలని ఆయన సూచించారు.