: వారి పెళ్లి ఆ గ్రామాలకు మరపురాని జ్ఞాపకంగా నిలిచింది


వివాహం అనేది చిరస్మరణీయంగా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాగే తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కూడి సమీపంలోని ఎస్ఆర్ పట్టినంకు చెందిన గౌతమన్ ఫ్రాన్స్ లోని ఓ న్యాయస్థానంలో న్యాయ సలహాదారుగా పని చేస్తున్నారు. ఆయనకు పెళ్లి కుదిరింది. దీంతో ఆయన తన పెళ్లిని మధురజ్ఞాపకంగా మలచుకోవాలని భావించారు. దీంతో తన నిశ్చితార్థం కోసం 15 లక్షల రూపాయలు అద్దె చెల్లించి బెంగళూరు నుంచి తన గ్రామానికి హెలీకాఫ్టర్ తెప్పించుకున్నారు. తన తల్లిదండ్రులతో కలసి హెలికాప్టర్‌లో సాయంత్రం పెళ్లి కుమార్తె గ్రామంలో మామగారు సిద్దం చేసిన హెలీపాడ్‌ లో దిగి నిశ్చితార్థం ముగించుకుని, పెళ్లి కుమార్తెతో కలసి హెలీకాప్టర్‌ లో తన గ్రామానికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వరుని స్వగ్రామంలో మాంగల్యధారణ సమయానికి అదే హెలీకాప్టర్ ఆకాశం నుంచి పూలవర్షం కురిపించింది. వివాహానంతరం గ్రామస్థుల కేరింతల మధ్య వధూవరులిద్దరూ హెలికాప్టర్ ఎక్కి సుమారు గంటపాటూ గ్రామంపై చక్కర్లు కొడుతూ ఆకాశం నుంచి పలకరించారు. అంతటితో ఆగకుండా వారి తల్లిదండ్రులు, పెళ్లి పెద్దలు, గ్రామపెద్దలకు హెలీకాప్టర్‌ లో విహరించే అవకాశం కల్పించి వారికి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఊహలో కూడా లేని అవకాశం దక్కడం, ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసే గ్రామప్రజలు హెలీకాప్టర్ ను దగ్గర నుంచి చూడడంతో సంతోషంతో పొంగిపోయారు.

  • Loading...

More Telugu News