: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన సిక్కు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి ఊచకోతలో అసువులు బాసిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రధాని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ప్రధాని నిర్ణయం కారణంగా 3,325 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. గతంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేకపోయాయి.