: ధోనీని ఆకాశానికెత్తిన ఐసీసీ చీఫ్


తాను చూసిన గొప్ప క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకరని ఐసీసీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ ఆకాశానికెత్తేశారు. ఇండియా సిమెంట్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ సహయజమానిపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని క్రికెట్ పై ధోనీ విశేషమైన ప్రభావం చూపుతున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. కెప్టెన్ గా భారత జట్టును ముందుకు నడిపించడంలోనే కాకుండా ఆయన గొప్ప క్రికెటర్ అని తెలిపారు. మైదానంలో ధోనీ వ్యూహాలు అమోఘమని ఆయన కీర్తించారు. ధోనీ నాయకత్వం 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలను అందించిందని ఆయన పేర్కొన్నారు. భారతీయ క్రికెట్ కు ఇండియా సిమెంట్స్ ఎంతో సేవ చేసిందని, ఎందరో క్రికెటర్ల భవిష్యత్ ను తీర్చిదిద్దిందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News