: బాయ్ ఫ్రెండ్ తో కలిసి 'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల
'కత్తి', 'మిస్టర్ నూకయ్య' సినిమాల్లో హీరోయిన్ గా నటించిన బిగ్ బాస్ రియాలిటీ షో ఫేమ్ సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్టయ్యారు. అంబోలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్ తనను బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా పాల్పడుతున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఓ జిమ్ వద్ద తనపై దాడి చేశారంటూ సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్ పై సోహిల్ ఖాన్ అనే నటుడు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి, అంధేరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే అదే రోజు వారు బెయిల్ పై విడుదలైనట్టు అంబోలి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో తగిన ఆధారాలు సేకరిస్తున్నామని వారు తెలిపారు.