: ఫిట్ నెస్ తెలుసుకునేందుకు మైక్రోసాఫ్ట్ రిస్ట్ బ్యాండ్


ఫిట్ నెస్ పై అందర్లోనూ ఆసక్తి పెరుగుతోంది. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తించిన చాలా మంది వ్యాయామం వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎంత వ్యాయామం చేశారు? ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి? వంటి విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి మైక్రోసాఫ్ట్ సంస్థ రిస్ట్ బ్యాండ్ విడుదల చేసింది. దీని ధర 199 అమెరికన్ డాలర్లు. ఈ బ్యాండ్ ని చేతికి వాచీలా ధరిస్తే చాలు, వ్యాయామం చేస్తున్నప్పుడు ఎన్నికేలరీలు ఖర్చయ్యాయి? నాడీ స్పందన ఎలా ఉంది? ఎంత సేపు నిద్రపోయాం? వంటి వివరాలు తెలుసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మొత్తానికి మైక్రోసాఫ్ట్ ఈ బ్యాండ్ ని రూపొందించడం ద్వారా మరో కొత్త టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టినట్టైంది.

  • Loading...

More Telugu News