: ఎమ్మెల్యే బోండా ఉమ కుమారుడికి బెయిల్
కారు రేసింగ్ కేసులో అరెస్టయిన విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కుమారుడు సిద్ధార్థ్ కు బెయిల్ లభించింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న అతనిని ఈ సాయంత్రం అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విచారించిన కోర్టు, ఐదువేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తులతో బెయిల్ ఇచ్చింది.