: ఐదుగురు తమిళనాడు మత్స్యకారులకు శ్రీలంక కోర్టు మరణశిక్ష


తమిళనాడుకు చెందిన ఐదుగురు మత్స్యకారులకు శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుపై వారు లంక సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు కోర్టు 14 రోజుల సమయం ఇచ్చింది. 2011లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో వారిని లంక నౌకాదళం అరెస్టు చేసింది. ఈ తీర్పుపై భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందిస్తూ, "ఈ విషయాన్ని మేము పరిశీలిస్తాం. కింది కోర్టు ద్వారా ఈ తీర్పు వెల్లడయింది. పైకోర్టులో ఈ కేసును మేము సవాలు చేస్తాం" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News